Header Banner

తెనాలిలో పోలీస్ లాఠీఛార్జ్ వీడియో వైరల్! ఒకరు సస్పెండ్!

  Tue May 27, 2025 19:42        Politics

ఖాకీ డ్రస్‌ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే.. ఇప్పుడు ఆ పప్పులు ఉడికే రోజులు పోయాయి. అధికారం అండతో ఏం చేసినా చెల్లుతుందనుకున్న తెనాలి పోలీసులకు షాక్ తగిలింది. ఒక కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను నడిరోడ్డుపైకి తీసుకొచ్చి అమానుషంగా లాఠీతో కొట్టిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌అయ్యింది. దీనిపై స్పందించిన పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు సదరు పోలీసులపై యాక్షన్ తీసుకున్నట్టు సమాచారం.


ఇంతకీ ఏం జరిగిందంటే..

గంజాయి మత్తులో జాన్‌ విక్టర్‌, రాకేష్‌, బాబూలాల్‌ అనే ముగ్గురు వ్యక్తులను.. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిరంజీవిపై దాడి చేశారని ఆరోపిస్తూ గత నెల 27న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతే కాకుండా వారిపై పలు కేసులు, రౌడీషీట్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారిని ఐతానగర్ ప్రాంతానికి తీసుకెళ్లి శారీరకంగా శిక్షించినట్లు తెలుస్తోంది. టూ టౌన్‌ సీఐ రాములు నాయక్‌, త్రీ టౌన్‌ సీఐ ఎస్‌ రమేష్‌ బాబు నడిరోడ్డు మీద వారిని అరికాళ్లపై లాఠీలతో అమానుషంగా కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది.


ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!

 

అయితే వారిలో ఒకరు దెబ్బలకు తాళలేక కాళ్లు ముడుచుకోగా.. సీఐ రాముల నాయక్‌ బూటు కాళ్లతో తొక్కి పట్టుకున్నారు. నిందితుల్లో ఇరువురు ఎస్సీ సామాజిక సామాజిక వర్గానికి.. మరొకరు మైనార్ వర్గానికి చెందిన వారుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరు పరిచి శిక్ష అమలయ్యేలా చూడకుండా.. ఈ రకంగా దాడికి దిగడం ఏమిటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోను వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తీవ్రంగా విమర్శించారు. "తప్పు చేసినా వారిని కొట్టే హక్కు పోలీసులకు లేదు. ఇది బాబు పాలనలో పౌరహక్కులు లేని దుస్థితి" అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించడంతో పోలీసు శాఖ వేగంగా స్పందించింది. వీడియోలో కనిపించిన పోలీసు అధికారిని తక్షణమే సస్పెండ్ చేశారు. అలానే కానిస్టేబుల్‌పై దాడి ఘటనను మూడు రోజులు పోలీసులు గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటి ? అని విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. కస్టడీ లోపల గానీ, బహిరంగంగా గానీ హింసను ప్రేరేపించమని.. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ పోలీసు అధికారి ప్రముఖ మీడియా సంస్థకు వివరించారు.


ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!

 

సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!

 

అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!

 


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tenali #LathiCharge #PoliceAction #ViralVideo #AndhraPradesh #PoliceSuspended #BreakingNews